అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప-2 – ది రూల్’. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కనివిని ఎరుగని రీతిలో దాదాపు మూడు లక్షల వరకు హాజరైన అభిమానుల సమక్షంలో జరగడం విశేషం. ఈ ట్రైలర్ తరువాత సినిమాపై క్రేజ్.. అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నట విశ్వరూపం డిసెంబరు 5న ప్రపంచమంతా చూడబోతుంది. దర్శకుడు సుకుమార్ టేకింగ్… కల్డ్ మాస్ మేకింగ్ గురించి మాట్లాడుకోబోతున్నారు. ఇక ఈ చిత్రంలో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రత్యేక పాట అప్‌డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్, శ్రీలీలపై చిత్రీకరించిన ‘కిస్సింగ్’ పాటను నేడు (ఆదివారం) చెన్నైలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సాంగ్‌ను సాయంత్రం ఏడు గంటల రెండు నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నారు. అల్లు అర్జున్ డ్యాన్సుల గురించి, డ్యాన్సుల్లో ఆయన ఎనర్జీ, ఈజ్, స్టయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక డ్యాన్సుల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న కథానాయిక శ్రీలీల. ఈకాంబోలో ప్రత్యేక గీతం అంటే ఇక ఫ్లోర్ ఫైరే… ఈ సాంగ్ పుష్ప-2లో మరో సన్సేషన్ సాంగ్‌గా నిలవబోతుంది. ఈ ఇద్దరి డ్యాన్సింగ్ ఫైర్‌కు దేవి శ్రీ ప్రసాద్ బాణీలు తోడైతే.. ఇక మాస్.. మాస్ జాతరే.. రెడీ టూ వాచ్ ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ సాంగ్ అని చిత్ర బృందం పేర్కొంది.