సంక్రాంతికి పక్కా మాస్‌ బొమ్మ

‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తరువాత మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబి 28’ (వర్కింగ్‌ టైటిల్‌). హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ఎస్‌.రాధాకష్ణ (చినబాబు) భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలు. నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ చిత్ర యూనిట్‌ ఆదివారం సాయంత్రం ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. కూల్‌ గ్లాసెస్‌తో స్టయిలీష్‌గా సిగరెట్‌ కాలుస్తూ గుంటూరు మిర్చి ఘాటుని తలపిస్తూ మహేష్‌ మాస్‌ లుక్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. దీంతో ఇదొక పక్కా మాస్‌ బొమ్మ పోస్టర్‌ చెప్పకనే చెప్పింది