నవతెలంగాణ-నాగిరెడ్డి పెట్
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం, వెంకంపల్లి, ఆత్మకూర్ గ్రామాలతో పాటు పలు గ్రామాలలో ఆదివారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పోచారం కాంగ్రెస్ పార్టీకి గ్రామ అధ్యక్షుడు కిరణ్తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.