ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారే చిత్రపటాలకు పాలాభిషేకం

నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి,మంత్రి వర్గంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు స్థానం లభించడం తిరిగి గురువారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ల చిత్రపటాలకు నారంవారిగూడెంకు చెందిన తుమ్మల యూత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసారు. కార్యక్రమంలో తుమ్మల యూత్, అభిమానులు, ఆడపడుచులు కార్యకర్తలు పాల్గొన్నారు.