
శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయడం తో శనివారం కుభీర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, యువకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈసందర్భంగా కుభీర్ మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు లవకుశ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉండేందుకు ఎంతో కృషి చేయడం జరుగుతుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ కార్యాలయాలలో ఉద్యోగ నియామకాలు జరిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు.గత బీఆర్ ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు గా ఏఒక్క ఉద్యోగాలు కల్పించిన సందర్బాలు లేకపోలేదు .దింతో వచ్చిన కొద్దిరోజులుగా నే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో ఇచ్చిన హామీలను క్రమం తప్పకుండా నెరవేయడం జరుగుతుందని అన్నారు.రైతులకు 1లక్ష 50 వేళా వరకు రుణమాఫీ పక్రియ ప్రారంభించి మరి కొన్ని రోజుల్లోనే 2లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసి అదే విదంగా నిరుద్యోగుల భవిష్యత్తు ను తీర్చిదిద్దలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగిందని అన్నారు.ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు బషీర్ జాదవు శంకర్ బంక బాబు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.