ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలో గాంధీ చౌక్ లో  తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గౌ”శ్రీ శివసేన రెడ్డి గారిఆదేశాల మేరకు  మండల కేంద్రంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ జుక్కల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఇంరోజ్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఇమ్రోజ్ మాట్లాడుతూ ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. గత బి ఆర్ స్ ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఉద్యోగుల కోసం  ఉసు తియ్యకుండా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించి వారి జీవితాలతో చెలగాటం ఆడారాని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు యువతకు అన్యాయం చేసారని  దింతో బి.ఆర్.ఎస్ పార్టీ కి  ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.  రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారాని  దానికోసం యువజన కాంగ్రెస్ నాయకులు  ముందుండి పని చేస్తమని  కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అని అయన కొనియాడారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాలకు సరియైన న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి  కాళోజీ,జీవన్,విఠల్,బస్వరాజ్,శ్రీనివాస్,రాంసింగ్,మల్లేశం,మునీర్,ఇస్మాయిల్,బచ్చన్,పోచయ్య,తదితరులు పాల్గొన్నారు.