నవతెలంగాణ – నసురుల్లాబాద్
రైతులకు రెండవ విడత రుణమాఫీ నిధులు విడుదల సందర్భంగా కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాల నాయకులు వేరు వేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో మొదటి విడత లక్ష వరకు రుణమాఫీ, రెండో విడత లక్ష యాబై వేలు రుణమాఫీ నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇది రైతు ప్రభుత్వం అని రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. రైతుల కోసం రుణమాఫీ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రతాప్ సింగ్ రాథోడ్, కంది మల్లేష్, మైష గౌడ్, ఇమ్రాన్, శ్రీనివాస్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం నాయకులు అరిగే సాయిలు, అయినాల లింగం, శాంతయ్య, లక్ష్మణ్, గూడెం రవి తదితరులు పాల్గొన్నారు.