సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

– విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి కానుక
నవతెలంగాణ జమ్మికుంట
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సి, ఎస్టి, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమ వసతి గృహల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల కోసం 40 శాతము డైట్, కాస్మోటిక్స్ చార్జీలను పెంచి, మరింత మంచి పౌష్టికాహారం అందించేందుకు కొత్త డైట్ ను సిద్ధం చేసిందని కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు కసుబోసుల వెంకన్న ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు యండి ఇమ్రాన్ లు అన్నారు. మంగళవారం  జమ్మికుంటలోని బాలుర వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులు, ప్రభుత్వ వసతి గృహా విద్యార్థులకు ఇటీవల డైట్, కాస్మోటిక్స్ చార్జీలను పెంచినందులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎం.ఎల్.సి బల్మూర్ వెంకట్  చిత్రపటానికి ఎన్ఎస్ యు ఐ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని,  గత బి ఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులపై చూపిన నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ మండిపడ్డారు. అహంకార పాలనకు వ్యతిరేకంగా ఆనాడు విద్యార్థులు, నిరుద్యోగులు  ఉద్యమాలను  చేశారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికి న్యాయం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి.సలీం, ఎగ్గని శ్రీనివాస్, చిన్నింటి నాగేంద్ర, శ్రీనివాస్,  శ్రీనివాస్, రాజమౌళి, ప్రభుదాస్,  శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, వంశీ,  రమేష్, సమ్మయ్య,  ప్రవీణ్ పాల్గొన్నారు.