సీఎంరేవంత్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం..

– నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
– వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ..
నవతెలంగాణ – వేములవాడ 
రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ.. రైతులకు ఇచ్చిన మాట రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని శనివారం వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం  చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలపడం హర్షనీయమని అన్నారు. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 లోపు  తీసుకున్నారని వారు , రుణాలకు వర్తింపు. 48 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వారన్నారు.ఆగస్టు 15, లోపు రుణమాఫీ పూర్తిచేసేందుకు కసరత్తు. మే 6, 2022 నాటి వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రుణమాఫీ హామీ ఇచ్చిన నిలబెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డిఅని వెల్లడించారు.10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత కరెంటు పైన సంతకం పెట్టి ఉచిత కరెంటు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. రైతు సంక్షేమం కోరుకునే పార్టీ… రైతు బాగు కోరుకునే పార్టీ.. రైతు బాగు కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కి వేములవాడ రైతుల పక్షాన ప్రజల పక్షాన ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, నాయకులు చిలుక రమేష్, కనికరపు రాకేష్, పులి రాంబాబు గౌడ్, ముప్పిడి శ్రీనివాస్, వంగల శ్రీనివాస్,నాగుల రాము, పుల్కం రాజు, తోట లహరి, ముప్పిడి శ్రీధర్, వస్తాది కృష్ణ నాగుల మహేష్, కోయినేని బాలయ్య, తోటరాజు, బైరి సతీష్, నామాల పోశెట్టి, అరుణ్ తేజ చారి,దాడి మల్లేశం, కొక్కుల రాజు, వరిచే మల్లేశం, కతాడి రాజేశం, అంబాటి చందు, ఎర్ర శ్రావణ్, మండే రాజు,  సాబీర్, ఇబ్రహీం, దూలం భూమేష్,మర్రిపల్లి రాజు,చిట్టి, లత,  మహదేవుని అంజయ్య, తో పాటు తదితరులు పాల్గొన్నారు.