
జాతీయ రహదారి 63 బస్టాండ్ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ రెడ్డి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన విధంగా రైతులకు రుణమాఫీని అమలు చేస్తుందని, మొదటి విడతగా లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తున్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేస్తుందని అన్నారు. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని, కాంగ్రెస్ పార్టీ రైతు శ్రేయస్సు కోరే పాఠాన్ని అన్నారు. పాలాభిషేకం అనంతరం జాతీయ రహదారి నుండి రైతు వేదిక వద్దకు ర్యాలీగా వెళ్లి రైతు సమావేశాన్ని నిర్వహించారు. రైతులకు రుణమాఫీ చేయడం పట్ల రైతులు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మొదటి దశలో 7600 మంది రైతులకు రుణమాఫీని అమలు చేస్తుందని, దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతూ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాములు, అశోక్, గోపి, మహిపాల్, సతీష్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.