
మండలంలోని పలు గ్రామాలలో, జుక్కల్ కేంద్రం లోని అంబేడ్కర్ చౌరస్తా వద్గ రైతులు మండల కాంగ్రేస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్జి చిత్ర పటానికి గురువారం నాడు పాలాభిషేకం చేసారు. ఈ సంధర్భంగా సంబురాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు రైతులు మాట్లాడుతు ముఖ్యమంత్రి రైతులకు ఎన్నికలలో ఇచ్చిన హామీని నేడు ప్రత్యేక్షంగా రుణమాఫీ చేయడం దేశంలో కెల్లా గోప్ప సహసోపేతమైన గౌరవం తక్కుతుందని, అన్న మాటకు మడమ తిప్పకుండా, రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పడికి రైతుల పైన ఉన్న ప్రేమ అమేాగఘం అని, జీవితాంతం కాంగ్రేస్ పార్టీకి రాహుల్ గాందీకి, ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులకు, స్థానిక నాయకులకు రుణపడి ఉంటామని, అభినంధనలు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రేస్ శ్రేణులు తదితరులు పాల్గోన్నారు.