నవతెలంగాణ – శాయంపేట
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు లక్ష రుణమాఫీ పథకాన్ని అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని ప్రగతిసింగారం గ్రామంలో గురువారం కాంగ్రెస్ మండల నాయకులు బోనపల్లి రఘుపతిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అధికారం చేపట్టిన 8 నెలల్లో అమలు చేసిందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రుణమాఫీని విడుతల వారీగా ఇవ్వడంతో వడ్డీలకే సరిపోయాయని అన్నారు. ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరకాల ఏఎంసీ మాజీ చైర్మన్ పోలపల్లి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు మోరే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.