నవతెలంగాణ – తంగళ్ళపల్లి
నేత, చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, నేతన్న కార్మికులకు చేయుతనందిస్తుందని జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మోర రాజు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత, నేత, అనుబంధ రంగాల కార్మికులకు పలు పథకాలను అమలు చేస్తూ జీవో విడుదల చేసిన సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శనివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,క్యాబినెట్ మంత్రులకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం చేనేత, మరమగ్గాల కార్మికులు, అనుబంధ రంగాల కార్మికుల సంక్షేమం కొరకు G.O. నెం. 3 ద్వారా తెలంగాణ చేనేత అభయ హస్తంలో భాగంగా పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించిందన్నారు. అందులో నేతన్న పొదుపు, నేతన్న భద్రతా, నేతన్న భరోసా పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. నేత కార్మికుడు మరణిస్తే నేతన్న భీమా ద్వారా వారి కుటుంబానికి రూ.5లక్షలు అందించనున్నట్లు తెలిపారు.ఈ కార్య్రమంలో కాంగ్రెస్ మండల మండల అధ్యక్షులు ప్రవీణ్, పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపెల్లి ఆనందం, అంకరపు మహేష్, బీమని అశోక్, లక్ష్మినర్సు, నారాయణ, గంగాధర్, కోడం శ్రీధర్, కార్మిక సంఘాల నాయకులు, చేనేత కార్మికులు, పవర్ లూమ్ కార్మికులు పాల్గొన్నారు.
టెక్స్ టైల్ పార్కులో…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయాలని తీర్మానించిన సందర్భంగా మండలంలోని టెక్స్ టైల్ పార్క్ లోని పవర్ లూమ్ కార్మికులందరూ పార్కు గేటు ముందు సీఎం, మంత్రిమండలి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.