కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం 

నవతెలంగాణ- నసురుల్లాబాద్ 
రుణమాఫీ చేస్తానని రైతులకు ఇచ్చిన మాటకు సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. రైతు రుణమాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో హర్షం వ్యక్తం చేస్తూ నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటలకు  బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు పాలాభిషేకం చేశారు. మండలంలోని హజీపూర్, సంగెం, మిర్జాపూర్, మైలారం, నసురుల్లాబాద్, దుర్కి, నాచుపల్లి సొసైటీల వద్ద ఘనంగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్  మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహాయం దేశంలోని మరే రాష్ట్రంలో అందించలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తానని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పాల్త్య విఠల్, నాయకులు మారుతి పటేల్, గంగారాం, సాయగౌడ్, నర్సింలు గౌడ్, మైషగౌడ్, ప్రతాప్ సింగ్, తదితరులు హాజరయ్యారు.