నవతెలంగాణ-జగదేవపూర్
ముదిరాజ్ భవనానికి రూ.15 లక్షలు మంజూరైన సందర్భంగా బుధవారం సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు చిత్ర పటాలకు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. దౌలాపూర్ గ్రామంలో సర్పంచ్ యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, ముదిరాజ్ సంఘము మహిళ మండల అధ్యక్షురాలు జయమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ద్వారా లబ్ది జరగని కుటుంబం లేదన్నారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, యఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,లకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌యస్ గ్రామ అధ్యక్షులు జూపల్లి మధు, మాజీ ఉప సర్పంచ్ కాదుర్ల రాజు, రాగుల యాదయ్య, బోయిని పుల్లయ్య, అనేమైన సత్యనారాయణ, నాగపూరి నాగులు, రాగుల చంద్రయ్య, యాట మల్లయ్య, పోకల రమేష్,మ్యాడమైన సిద్దులు, అనేమైన రామమ్మ,కాదుర్ల యాదగిరి,బరిగే వీరాస్వామి, కాదుర్ల నర్సీంలు పాల్గొన్నారు.