మంథని నియోజకవర్గంలోని పలు మండలాలకు నూతన రహదారుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ సోమవారం కాటారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మంత్రి శ్రీధర్ బాబు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. గ్రామ గ్రామాన ఎలాంటి అతంరాయం లేని రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకుకెళ్తున్న మంత్రికి మండల ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, మహిళా అధ్యక్షురాలు జాడి మహే శ్వరీ, యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, అయిత శకుంతల, చిటూరి మహేశ్, గద్దె సమ్మిరెడ్డి, కుంభం రమేశ్ రెడ్డి, చీమల రాజు పాల్గొన్నారు.