నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని కన్నాపూర్ లో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కల్వకుంట్ల మదన్ మోహన్ రావు చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రవీందర్ రావు, ఉప సర్పంచ్ అంజిల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ .10 కోట్లు నిధులు కేటాయించినందుకు పాలాభిషేకం చేశామని, భవిష్యత్తులో మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ వెంకటస్వామి, రైతు కన్వీనర్ మహేష్ యాదవ్, ప్రశాంత్, హరీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.