సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం..

Palabhishek for portraits of CM and MLA..నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండలం బాగేపల్లి గ్రామంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఆగంటి సురేందర్ గౌడ్, స్థానిక నాయకులు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఊహించని రీతిలో రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి మొదటి విడతగా రూ.7000 కోట్ల రూపాయల ను మొదటి విడుదల విడుదల చేయడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఆరు గ్యారెంటీ పథకాలతో భాగంగా రైతు రుణమాఫీ ఈరోజు లాంచింగ్ చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాయ గౌడ్, ఆటో సాయిలు, గోపాల్, స్థానిక రైతులు యువత పాల్గొన్నారు.