
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటాలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇతర నాయకులతో కలసి బుధవారం ప్రజాభవన్ లో పాల అభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో తెలిపినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క సమక్షంలో నిర్వహించిన ముఖ్య నేతల సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా రైతుల అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.