ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య కార్యాలయం వద్ద శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో నేటి నుండి  రెండు గ్యారంటీలు అమలవుతున్న సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతుంది అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల  అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజు ఆరోగ్య భీమ 10 లక్షల పెంపు రెండు గ్యారెంటీలను చేసిందన్నారు. ప్రస్తుతం రూ. 500 కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం  శ్రీకారం చుట్టిందన్నారు. మిగిలిన గ్యారంటీలను కూడా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది అన్నారు. ఆరు గ్యారంటీల  అమలుపై ప్రతిపక్షాలు కారు కూతలు కూయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాలపు నరసయ్య, వేముల గంగారెడ్డి, తక్కురి  దేవేందర్, బుచ్చి మల్లయ్య, సింగిరెడ్డి శేఖర్, వేములవాడ జగదీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.