
మోపాల్ మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక దగ్గర జిల్లా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్పగగారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి దాని అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ముప్ప గంగా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని మాట ప్రకారం రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతున్నామని గతంలో రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా చేశాడో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన బాటలోనే రుణమాఫీ చేశాడని అప్పుడు చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు చేసింది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ కర్షక రైతు పక్షపాత పార్టీ అని ఆయన తెలియజేసారు. మధ్యలో వచ్చిన ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప రైతుల గురించి ఏరోజు ఆలోచించలేదని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6 గ్యారంటీలను కూడా అమలు చేస్తూ అందులో ముఖ్యంగా రుణమాఫీ అనేది రైతుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతుందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు రాజులవుతారని, దేశంలో మిగతా రాష్ట్రాలకి తెలంగాణ రోల్ మోడల్ గా అవుతుందని, 2022 మీ 6 తేదీన వరంగల్ సభలో డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ మాట ఇచ్చారని ఆ మాటను ప్రియతమ ముఖ్యమంత్రి ఆగస్టు 15 లోగా ఏకకాలంలో రుణ మాఫీ చేస్తున్నాడని ఆయన తెలిపారు. అలాగే కెసిఆర్ లాగా మాటలు చెప్పి రైతులను మభ్య పెట్టడం లేదు ఏక మొత్తంలో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచిపనిని ప్రజలకు వివరిస్తున్నామని, తెలంగాణలో రైతు రుణమాఫీ పై దేశవప్తంగా చర్చ జరుగుతుందని రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఒక పండగ వాతావరణం నెలకులుతుందని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి, బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మోహన్, లింగన్న, జలంధర్ రెడ్డి, అమరాబాద్ రవి, సాయికుమార్, గుడి ప్రవీణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.