సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

జక్రాన్ పల్లి మండల యువజన విభాగం ఆధ్వర్యంలో మొన్న శాసనసభ లో బీసీ సమగ్ర కుల గణన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో జక్రాన్ పల్లి మండల బీసీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, భట్టి విక్రమార్క కి బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి  చిత్రపటాలకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో  పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ మొత్తంలో 60 శాతం ఉన్న బీసీలు 15% కి చేస్తున్నందున పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ బీసీలను చిన్నచూపు చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు బీసీ కులగలా లెక్కచేసి వాళ్లకు రావాల్సిన వాటా ఆమోదం తీర్మానం ఏకగ్రీవంగా చేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కార్యక్రమంలో జక్రాన్ పల్లి మండల యువజన విభాగం అధ్యక్షుడు సొప్పారీ వినోద్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఉపాధ్యక్షులు ఉత్కం శ్రీనివాస్ గౌడ్ నాయి బ్రాహ్మణ అధ్యక్షులు రమేష్ మైనార్టీ మండల అధ్యక్షుడు సైకిల్ టెక్స్ అక్బర్ జిల్లా యువజన విభాగం సెక్రెటరీ ముంబాయి రాజేందర్ లక్ష్మాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు నరేష్, జీవన్ జక్రన్ పల్లి మండల రజక సంఘం అధ్యక్షులు సాగర్ రత్నగిరి రాజేష్ గాడ్  బి నారాయణ వి రవి గౌడ్ ఎన్ కిషన్ ముదిరాజ్ సోప్పరి చింటు సొప్పారీ సుధీర్  ప్రేమ్ కుమార్  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.