సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం…

నవతెలంగాణ – ఏర్గట్ల
రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడంతో, ఏర్గట్ల మండల కిసాన్ కాంగ్రేస్ అధ్యక్షులు ముస్కు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది రైతు ప్రభుత్వం అని, రైతుల కోసం రుణమాఫీ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ గడ్డం జీవన్, పన్నాల నర్సారెడ్డి, కురాకుల బొర్రన్న, ఇంద్రాసేనా రెడ్డి, దండేవోయిన సాయి కుమార్, రొక్కెడ చిన్న సాయన్న, బద్దం జితేంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.