సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ-కమ్మర్ పల్లి

మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అని క్యాబినెట్లో తీర్మానించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి  సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చిన ప్రకారం వరంగల్ డెక్లరేషన్ లో పేర్కొన్నట్లుగా ఏకకాలంలో రూ.2లక్షల రుణ మాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. ఈ విషయమై క్యాబినెట్ లో చర్చించి ఆగస్టు 15తారీకు లోపు ఏక కాలంలో రూ. 2 లక్షలు రుణ  మాఫీ చేస్తామని క్యాబినెట్ తీర్మానం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామన్నారు. రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుంకేట రవి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేలా ప్రవీణ్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, తిప్పిరెడ్డి శ్రీనివాస్, పాలేపు నర్సయ్య, గోపీడీ లింగారెడ్డి, తక్కురి దేవేందర్, సుంకేట భూచ్చన్న, అల్లాకొండ రాజేష్, సింగిరెడ్డి శేఖర్, కొమ్ముల రాజేందర్, వేముల గంగారెడ్డి, జైడి శ్రీనివాస్, కుందేటి శ్రీనివాస్, సుంకేట శ్రీనివాస్, భూచ్చి మల్లయ్య, ప్రసాద్,  సంజీవ్, రవీందర్, సృజన్, అనిల్, గంగారెడ్డి, భూమారెడ్డి, నర్సయ్య, మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.