ఎంపీ సంతోష్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని కోనా సముందర్ సింగల్ విండో కార్యాలయం వద్ద శుక్రవారం  రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన గోదాము నిర్మాణం కొరకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కృషితో ఎంపీ సంతోష్ కుమార్ తన రాజ్యసభ నిధుల నుండి  రూ.10 లక్షలు మంజురు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ  విండో చైర్మన్ సామా బాపురెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు  తెలిపారు. ఈ సందర్భంగా విండో చైర్మన్ సామా బాపురెడ్డి మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి రైతుల శ్రేయస్సు కోసం, విండో అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి  విండో చైర్మన్ సామ బాపురెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కాలేరు శేఖర్, మాజీ ఉప సర్పంచ్ పేరం లింబాద్రి, విండో కార్యదర్శి రాజేశ్వర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.