నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని బినోల గ్రామంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ అమీర్ కు బుధవారం పాలభిషేకం చేశారు. 79 కోట్ల 89 లక్షల 50 వేల బడ్జెట్ కేటాయించి బినోల లిఫ్టు ఇరిగేషన్ పనులకు ప్రోసిడింగ్ ఇచ్చిన సందర్భంగా రైతులు బిఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వైస్ చైర్మన్ బాబర్ మాట్లాడుతూ బినోల గ్రామస్తుల చిరకాల కోరిక బినోల లిఫ్టు ఇరిగేషన్ ను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ కవిత మరియు ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఇరిగేషన్ మంత్రిగా చేసిన సుదర్శన్ రెడ్డి దృష్టికి లిఫ్ట్ విషయమై పలుమార్లు తీసుకెళ్లిన స్పందించకుండా తన సొంత ఊరు సిరన్ పల్లికి లిఫ్టు మంజూరు చేసుకున్నారని విమర్శించారు. బినోల గ్రామస్తులు రైతులు బిఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటారని రానున్న ఎన్నికల్లో గ్రామంలో అఖండ మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామని సర్పంచ్ పితాంబర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పద్మ విజయ్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు లక్ష్మణ్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు మోహన్, సీనియర్ నాయకులు తొంటి రవి, కైసర్, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.