సీఎం రేవంత్, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలో భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి లకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వంద రోజుల్లో ఐదు పథకాల హామీ లో భాగంగా రైతు రుణమాఫీ  రెండు లక్షల రూపాయలను 15 ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ చేయడం వలన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి,  మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీపీ ఎంపీటీసీ ల పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి ఎంపీటీసీలు తమ సమస్యలను వివరిస్తూ ఎంపీటీసీలకు విధులు నిధులు లేనందువలన ఎంపీటీసీలు ఉత్సాహ విగ్రహాల ఉండవలసి వచ్చిందనీ, రాబొయేరోజులలో కొత్తగా వచ్చే ఎంపీటీసీలకు విధులు నిధులు కల్పించే గౌరవించాలని కోరడంతో  ఎమ్మెల్యే తమ నిధుల నుంచి సిడిఎఫ్ నిధుల నుండి ఎంపిటిసి లకు 5 లక్షల రూపాయలను ఇస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, మాజీ ఎంపీటీసీ మచ్చ మాలతి నరసింహ గౌడ్ మాజీ ఉపసర్పంచ్ మోత్కుపల్లి యాదగిరి, ఉడుత నరేష్, అన్నంపట్ల బాలస్వామి, ఎం నరేష్, మచ్చ మల్లేష్, బబ్బురి రాజు, నరాల మల్లేష్, నరాల బాలయ్య, మచ్చ బాలయ్య, మాటూరు సంపత్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.