నవతెలంగాణ – రెంజల్
రెంజల్ సౌమ్య గార్డెన్ ఫంక్షన్ హాల్ లో రెంజల్ మండల పజా ప్రతినిధులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేసి చరిత్రలోనే ఆదర్శంగా నిలిచారని రైతులు పేర్కొన్నారు. శుక్రవారం మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సమక్షంలో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, స్థానిక నాయకులు జావీద్, హాజీ ఖాన్, వచ్చేవార్ నితిన్, స్థానిక మండల రైతులు ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.