యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి కి పాలాభిషేకం

నవతెలంగాణ-వీణవంక 
వీణవంక మండలం కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి ప్లెక్సీకి గురువారం పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తుందని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని నాయకులు పేర్కొన్నారు. సీఎం కెసిఆర్ రైతులకు ఇచ్చిన రుణ మాఫీ అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ తగ్గించాలని రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరించి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం మానుకోవాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ మందు ధర్నా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, సీనియర్ నాయకులు గంగాడి రాజీ రెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి, అడిగొప్పుల సంపత్, యూత్ కాంగ్రెస్ నాయకులు పర్లపల్లి ప్రసాద్, చింతల హరీష్ రెడ్డి, తాళ్లపల్లి తిరుమలేష్, గుండేటి మహేష్, బుర్తుల దయాకర్, అజేయ్ తదితరులు పాల్గొన్నారు.