రైతు రుణమాఫీపై క్యాబినెట్ మీటింగ్ లో రెండు లక్షల రుణమాఫీ ఆమోదం పొందినందుకు శనివారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పంచామృతం, పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..
గత ప్రభుత్వాలు రైతులకు రుణమాఫీ చేస్తామని ఐదు సంవత్సరాలు కాలయాపన చేశాయన్నారు. రైతుల రుణమాఫీ పై కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం ఆగస్టు 15 లోపు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే విధంగా విధివిధానాలను రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కేడo లింగమూర్తి, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ , జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తారి రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్స్ వల్లపు రాజు, భూక్య సరోజన, పున్న సది లావణ్య, వేన్న రాజు తదితరులు పాల్గొన్నారు.