నవతెలంగాణ- రెంజల్
షెడ్యూల్ టైప్ డెవలప్మెంట్ నిధుల కింద బోధన్ నియోజకవర్గానికి 15 కోట్ల 40 లక్షల రూపాయలు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, దీనికి తమ సహాయ సహకారాలను అందజేసిన బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకిల్ అమీర్ చిత్రపటాలకు బిఆర్ఎస్ మండల పాలాభిషేకం నిర్వహించారు. బుధవారం రెంజల్ మండలం వీరన్న గుట్ట తండా సర్పంచ్ జాదవ్ గణేష్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గానికి గిరిజన తండాల లింక్ రోడ్ల నిమిత్తం 15 కోట్ల 40 లక్షల రూపాయలు మంజూరు కాగా, రెంజల్ మండలంలోని గిరిజన తండాలకు 9 కోట్ల 50 లక్షల రూపాయలను కేటాయించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు భూమారెడ్డి, సర్పంచులు ఎమ్మెస్ రమేష్ కుమార్, వికార్ పాషా, పాముల సాయిలు, బైండ్ల రాజు, స్థానిక నాయకులు రోడ్డలింగం, రఫిక్, కృష్ణారావు, విజయ్, భూమేష్, బాబు నాయక్, జాదవ్ రాజు, తదితరులు పాల్గొన్నారు..