– నిర్మాణ పనుల నాణ్యతలో రాజీపడేదే లేదు
– పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పెద్దవంగర
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్ చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండలంలోని గంట్లకుంట, కొరిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ది పనులు సీసీ రోడ్లు, అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు, ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నిర్ణీత కాలంలో నిర్మాణ పనులను పూర్తి చేయాలని, నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. నియోజకవర్గంలో జరుగుతున్న నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడేది లేదని హెచ్చరించారు. గ్రామస్తులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరలో హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు హమ్యా నాయక్, తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమండ్ల తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీడీవో వేణుమాధవ్, ఉపాధ్యక్షులు రంగు మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, బానోత్ గోపాల్ నాయక్, దాసరి శ్రీనివాస్, ముత్తినేని శ్రీనివాస్, బొమ్మెరబోయిన రాజు, ఎర్ర సబితా వెంకన్న, బీసు హరికృష్ణ, వేముల వెంకన్న, వీరారెడ్డి, బానోత్ వెంకన్న, గ్రామ పార్టీ అధ్యక్షుడు ముత్తినేని సోమన్న, ఎండీ ముక్తార్ పాషా, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకల సమ్మయ్య గౌడ్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి కొండ్రాతి శ్రీనాథ్, కన్నె సతీష్, చింతల వెంకన్న, బండి లచ్చయ్య, ఎరుకలి యాకయ్య, కొండ్రతి కొమరమల్లు, ఈరేంటి శ్రీనివాస్, బందు వెంకన్న, చెరుకు సత్యం, కన్నే సంతోష్, చింతల యాకయ్య, చింతకింది ఆంజనేయులు, చింతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.