పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ అక్షయపాత్ర


– పల్లా వెంటే జనం కదులుతున్న పల్లెలు
– ప్రచారంలో దూసుకెల్లుతున్నా కారు
నవతెలంగాణ – నర్మెట్ట అక్షయపాత్రలాంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం నర్మెట్ట మండలంలో జనగాం నియోజకవర్గ ఇన్చార్జి తాటికొండ రాజయ్య, మలోత్ కవిత జనగామ బారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పల్లెల్లు చుట్టిపడుతు గడప గడపకు ప్రచారాన్ని ఉద్రుతం చేశారు. నర్మెట్ట ప్రజల ఆయనపట్ల ఆదరణ చూపుతుండడంతో జనం దండుగట్టి వెంట నడుస్తూన్నారు.
కొత్త, పాత తేడాలేకుండ అందరితో సహృదయంగా పలకరిస్తూ ఆయన ప్రచారంలో చూసుకెల్తున్నారు. జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన ప్రజలకు హమి ఇస్తున్నారు. రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థిని వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలంతా పలు గ్రామాలలో కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. నర్మెట్ట మండలంలోని గండి రామవరం గ్రామం ఈశాన్యం గ్రామం కావడం తో ప్రచరంన్ని గండి రామవరం నుంచి దొంగ చెల్మ తండా, రాంనగర్ తండా, మన్సింగ్ తండ, రామచంద్ర తండ, దుబ్బ తండా, ఆగ పేట, ఇసుక బాయి తండా, సూర్య బండ తండా, లొక్య తండ మచ్చు పహాడ్, గ్రామాలలో ప్రారంభించారు. కార్యకర్తలు, అభిమానులు ఆయన ప్రచారంలో పోటెత్తరు. ఏ గ్రామానికి కార్యకర్తలు, అందరిని పలకరిస్తూ అందరితో ముందుకు వెల్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలవల్ల జరుగుతున్న లబ్దిని వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.


ఈ ఎన్నికల ఇచ్చిన హమీల గురించి ప్రస్తావిస్తూ ఆయా పథకాలు, ద్వారా ప్రజలకు ఎలా లబ్ది చేకూరుతుందో వివరిస్తూన్నారు. 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లాంటి అభివృద్ధి చేయలేదు కానీ ఇప్పుడు వచ్చి అభివృద్ధి చేస్తామని ఆరు పథకాలని ప్రజలను మోసం చేస్తున్నారని వారి కల్లాబొల్లి మాటలు నమ్మొద్దని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తుందని, అన్నారు. రెండు సార్లు తె లంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మూడోసారి కూడా కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ జెడ్పిటిసి శ్రీనివాస్ జెడ్పి కోఆప్షన్ నెంబర్ ఎండి గౌస్, సర్పంచ్ శ్వేత కిషన్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శివరాజు, నర్మెట్ట సర్పంచ్ కమలాకర్ రెడ్డి, నర్మెట్ట తరిగొప్పుల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ పెద్ది రాజి రెడ్డి, రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగరావు, ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు సుధాకర్, బీఆర్ఎస్ పార్టీ  వైస్ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.