పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి చైర్మన్ కు సన్మానం..

Chairman of the Yellow Board Palle Gangareddy was honored.నవతెలంగాణ – ఆర్మూర్    
మండలంలోని  అంకాపూర్ గ్రామంలో పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డి  నియామకం కాగా మంగళవారం స్వగృహంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహం  నాయుడు ఆధ్వర్యంలో  ప్రముఖ న్యాయవాది వి బాలయ్య సామాజిక సేవకుడు కొక్కుల విద్యా సాగర్, తదితరులు పాల్గొని సన్మానించారు. ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా పసుపు బోర్డు కోసం ఎదురుచూసిన పసుపు రైతుల కల నెరవేరింది .  పసుపునకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసిన బిజెపి అగ్ర నాయకత్వానికి ధన్యవాదములు తెలిపారు స్వదేశీ జాగరణ మంచ్, తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో 2006 నుంచి 2014 వరకు అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేసి వినతి పత్రములు సమర్పించినప్పటికీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం  పట్టించుకోలేదు. కానీ 2019లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ  ప్రభుత్వం నరేంద్ర మోడీ  ఆశీస్సులతో, జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవతో నిజామాబాద్  కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, దానికి చైర్మన్ గా జిల్లా రైతుబిడ్డ  పల్లె గంగారెడ్డిని  చైర్మన్ గా  నియమించడం శుభ పరిణామము అని జ్ఞానుh.  రాబోయే రోజులలో పసుపు రైతులకు మేలు జరుగుతుందని కోటపాటి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రుక్మాజి, మామిడిపల్లి రైతు నాయకులు దొనకంటి సాయి రెడ్డి,, మల్యాల పోశెట్టి, బిజెపి రాజన్న , పాట కు నర్సారెడ్డి, లక్కారం పెద్ద నర్సింలు, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.