పల్లి రైతులకు గిట్టుబాటు ధర అందించాలి: దేశ్య నాయక్

Palli farmers should be given remunerative price: Deshya Naikనవతెలంగాణ – అచ్చంపేట 
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ రైతులకు ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశా నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు మార్కెట్ ను సందర్శించారు సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై  తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేశ నాయక్ మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర రూ.10000 చెల్లించాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ అధికారులు, కమిషన్ ఏజెంట్లు కుమ్మక్కై రైతులను మోసం చేయడం సరైనది కాదన్నారు. వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తేనే రైతులకు  కష్టానికి ఫలితం ఉంటుందన్నారు. అదేవిధంగా రైతులు  వ్యవసాయ మార్కెట్లో త్రాగు  నీరు,వసతి సౌకర్యం కల్పించాలన్నారు. వ్యాపారస్తులు రైతుల సమస్యలను, ఆర్థిక  ఇబ్బందులను  దృష్టిలో ఉంచుకొని వారికి గిట్టుబాటు ధర అందించేలా  కృషి చేయాలన్నారు. పెట్టుబడులకు ఖర్చు చేస్తూ గిట్టుబాటు ధర లభించకపోవడంతో  రైతులు మానసికంగా కృంగిపోయి కొంతమంది పెట్టుబడి ఎల్లక ఆత్మహత్యలకు గురవుతున్న పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి రైతులకు గిట్టుబాటు ధర అందేలా కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షాన రైతులతో కలిసి గిట్టుబాటు ధర ఇచ్చేవరకు రైతు సంఘం గా పోరాడుతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు శివకుమార్, ఎండి సయ్యద్ వాల్ సింగ్ రైతులు కృష్ణ, రెడ్యా నాయక్ వ్యవసాయ కూలీలు తదితరులు పాల్గొన్నారు.