నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హంస హౌమియోపతి వైద్య కళాశాల , పరిశోధన కేంద్రం, నాప్ కైమ్ తెలంగాణ చాప్టర్ అనుబంధంతో సంయుక్తంగా పాలియేటివ్ కేర్ ఒరియెంటేషన్, ఇంటిగ్రేషన్, ఇంటర్వెన్షన్ జాతీయ వర్క్‌షాప్‌ను కళాశాల ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుష్ డైరక్టర్ ఎం.ప్రశాంతి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి మనిషి తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అన్ని రకాల వైద్య విధానాలు వాడవలసిన అవసరం ఉందని తెలిపారు.జె.యస్.పి యస్ ప్రభుత్వ హౌమియోపతిక్ వైద్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అల్లోపతీ , ఆయుర్వేద , యునాని, హౌమియో , నేచురోపతి , సిద్ధ వంటి వైద్య విధానాల ప్రాముఖ్యతను తెలిపారు. హంస హౌమియోపతి వైద్య కళాశాల డైరక్టర్ డాక్టర్ ఉమేష్ అక్కలదేవి మాట్లాడుతూ క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్ , పక్షవాతం వంటి వ్యాధులకు పాలిjేటివ్ కేర్ చాలా అవసరం ఉంటుందని , ఈ వర్క్‌షాప్ ద్వారా విషయ పరిజ్ఞానం పొందవచ్చని తెలిపారు.