మండలంలోని పెర్టిలైజర్, పెస్టిసైడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన పమ్మిడి సాగర్ రావు రేండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా తెలిపారు. శుక్రవారం మండలంలోని కొయ్యుర్ గ్రామంలో సమావేశం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా పగడాల గట్టయ్య,తొగరి శ్రీనివాస్, అధ్యక్షుడుగా పమ్మిడి సాగర్ రావు,ఉపాధ్యక్షుడుగా తాళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా బొమ్మ రమేష్ రెడ్డి, కోశాధికారిగా అల్లాడి సురేష్,సమాచార సంయుక్త కార్యదర్శిగా బుర్ర సుధాకర్ ఎన్నికయ్యారు.రైతులకు అందుబాటులో నాణ్యమైన ఎరువులు,విత్తనాలు సరసమైన ధరలు అందిస్తామని ఈ సందర్భంగా అధ్యక్షుడు సాగర్ రావు వెల్లడించారు.