ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలని కరపత్రం విడుదల

నవతెలంగాణ  – భువనగిరి
ఈనెల 5,6 జరగబోయే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భువనగిరి అమరవీరుల స్తూపం వద్ద విద్యార్థులతో కరపత్రం ఆవిష్కరణ చేసి  అభివాదం చేశారు. బీసీవిద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ.. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడి జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమానికి లక్షలాదిమందిగా తరలిరావాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.  ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రుత్వ శాఖ ఏర్పాటు చేయాలని జనాభా గణనలో బీసీ కుల గణన చేయాలన్నారు. దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని గవర్నమెంట్ సంస్థలో ప్రైవేటీకరణ నిషేధించాలన్నారు. బీసీ క్రిమిలేయర్ ను ఎత్తివేయాలని బడ్జెట్లో బీసీలకు 5లక్షల కోట్లు కేటాయించాలని బీసీలంట్లే కేవలం ఓట్లు వేసే యంత్రాలుగనే చూస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు దేశ గవర్నమెంట్ ఉద్యోగాలలో బీసీలు ఆరు శాతం గిట్ల లేకపోవడం సిగ్గుచేటు ఈ సిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీసీల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు. బీసీ  బిల్లుకు మద్దతు అని చెప్పి ఇంతవరకు దాని ఊసే లేదన్నారు. బీసీ బిల్లుకు మద్దతు తెలపకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య, స్టూడెంట్ లీడర్ బద్దం శ్రీకాంత్ రెడ్డి, వట్టెం మధు, పబ్బల  ఎలీషా  స్వాతి, రాజేశ్వరి, మమత,సాయి తదితరులు పాల్గొన్నారు.