ప్రతి భారతీయుడు కచ్చితంగా చూడాల్సిన చిత్రంగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. ఈ చిత్ర గ్లింప్స్, టీజర్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకులు అజరు కుమార్ గ్లింప్స్‌ని, టీజర్‌ని నిర్మాత రామసత్యనారాయణ, ట్రైలర్‌ని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి.ప్రసన్నకుమార్ లాంచ్ చేశారు. దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ‘ఈ సినిమా ఇంత చక్కగా రావడానికి నాలో సగభాగం అయిన నా దర్శకుడు అజరుకే దక్కుతుంది. అలాగే ప్రసన్నకుమార్‌కి కూడా. ఈ సినిమాలో హీరో అంటూ ఎవరు ఉండరు ఈ సినిమాకి మెయిన్ హీరోలు ఆర్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్. సొసైటీకి ఉపయోగపడే కథతో సినిమా తీయాలని అనకున్నాను. దాన్ని తెరపై చూపించేందుకు నాకున్న అనుభవాన్ని అంతా వాడాను. అలాగే ఈ సినిమా చూసి చలపతిరావు చాలా బాగా వచ్చిందని ప్రశంసించారు. ఆయన ఆఖరి ప్రశంసలు నాకు దక్కాయి. రీసెంట్‌గా కొంతమంది దర్శకులు ఈ సినిమా చూసి, రికార్డ్ బ్రేక్ కరెక్ట్ టైటిల్ అని చెప్పారు. ఈ సినిమా ఖచ్చితంగా అన్ని భాషల్లోనూ వండర్స్ క్రియేట్ చేస్తుంది. లాస్ట్ 45 నిమిషాలు ఈ సినిమా మంచి ఎమోషనల్‌గా ఉంటుంది. అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అని తెలిపారు.