భిన్న కాన్సెప్ట్‌తో పాన్‌ ఇండియా సినిమా

భిన్న కాన్సెప్ట్‌తో పాన్‌ ఇండియా సినిమాఇటీవల ‘హరోం హర’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హీరో సుధీర్‌ బాబు ఈసారి సూపర్‌ నేచురల్‌ మిస్టరీ థ్రిల్లర్‌లో నటించబోతున్నారు. ఇది భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపొందనుంది. ఓ అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కి అందించేలా, లార్జర్‌ దేన్‌ లైఫ్‌ స్టోరీ లైన్‌తో ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధ్యానత ఉంది.
వెంట్‌ కళ్యాణ్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘రుస్తుం, టారులెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ, ప్యాడ్‌ మ్యాన్‌, పరి’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రేరణ అరోరా సమర్పణలో ఈ పాన్‌ ఇండియా సూపర్‌ నేచురల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రం రూపొందనుంది. త్వరలోనే చిత్ర యూనిట్‌తో బాలీవుడ్‌ హీరోయిన్‌ జాయిన్‌ కానుంది. త్వరలోనే మేకర్స్‌ ఆ వివరాలను తెలియజేస్తారు.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా మార్చిలో విడుదల చేయనున్నారు. లోతైన కథతో రానున్న ఈ చిత్రంలో కుట్ర, పన్నాగాలు కలగలిసిన చెడుకి, మంచి జరిగే యుద్ధంగా ఇండియన్‌ సినిమాల్లో ఓ మైల్‌ స్టోన్‌ మూవీలా బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కనుంది.
ఈ సందర్భంగా హీరో సుధీర్‌ బాబు మాట్లాడుతూ, ‘నేను ఈ సినిమా స్క్రిప్ట్‌ నచ్చి ఏడాది పాటు టీమ్‌తో ట్రావెల్‌ అవుతున్నాను. డిఫరెంట్‌ కంటెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఎప్పుడెప్పుడు వద్దామా అని చాలా ఆతతగా ఎదురుచూస్తున్నాను. వరల్డ్‌ క్లాస్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్షకులకు అందించటానికి ప్రేరణ అరోరా, ఆమె టీమ్‌ సభ్యులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఇది ప్రేక్షకుల మనసుకు హత్తుకుంటుందనే గట్టి నమ్మకం ఉంది’ అని అన్నారు. ప్రేరణ అరోరా, శివిన్‌ నారగ్‌, నిఖిల్‌ నంద, ఉజ్వల్‌ ఆనంద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఆగస్ట్‌ 15న విడుదల చేయనున్నారు.