
భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను గ్రామంలోని వాడవాడల ఊరేగించారు. శనివారం అన్నదాత భూషబోయిన లింగమ్మ కిష్టయ్య యాదవ్ , గురుస్వామి భూషబోయిన నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ యూత్ మాజీ అధ్యక్షులు మాట్లాడుతూ పాక జహంగీర్ యాదవ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా గ్రామస్తులు సహకారంతో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నదానం నిర్వహించిన లింగమ్మ కిష్టయ్య దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శివ స్వాముల బృందం సభ్యులు రాగిరి బాలరాజు గౌడ్, బోడ పట్ల మోహన్ రెడ్డి, రాగిరి పాండుగౌడ్, భూషబోయిన చిన్న నరసింహ యాదవ్, ఈర్ల భాస్కర్, భూష బోయిన సాయి, రాళ్ల బండి శేఖరా చారి, గుండు హరినాథ్ రెడ్డి, చీర్కా సుదర్శన్ రెడ్డి, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.