
నవతెలంగాణ – గోవిందరావుపేట
స్పెషల్ ఆఫీసర్ల సారధ్యంలో గ్రామ పంచాయతీల పాలన సజావుగా సాగుతుందని ఎంపీడీవో జవహర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జవహర్ రెడ్డి మాట్లాడుతూ గాడి తప్పిన అధికారుల పాలన అంటూ ఒక పత్రికలో వచ్చిన వార్తపై ఎంపీడీవో స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేశారని, కార్యదర్శి కి మేము ఇష్యూ అయిందని, పంచాయితీ పేరు, అధికారి పేరు రాయకుండా కథనాలు రాసి బదనాం చేయొద్దు అన్నారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. పాత్రికేయులు ఎలాంటి సమాచారం కావాలన్నా తనను గానీ కార్యాలయంలోని సంబంధిత అధికారులను కానీ అడిగి తీసుకోవచ్చని, లేదా సమాచార హక్కు చట్టం ద్వారా పొందవచ్చని సూచించారు.