– పెరిగిన పంచాయితీ ఓటర్లు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడం తో ఎన్నికల యంత్రాంగం పంచాయితీలు వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్దం చేసింది. స్థానిక ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఆదేశానుసారం మండల వ్యాప్తంగా పంచాయితీలు వారీగా ముసాయిదాను ప్రకటించారు. 2018 లో 30 పంచాయితీలకు గానూ 41,692 ఓటర్లు ఉండగా ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 46,624 మంది ఓటర్లు ఉన్నారు.గత ఎన్నికలు కంటే ఈ ఎన్నికల్లో 4932 మంది అధికంగా తమ ఓటును వినియోగించుకోనున్నారు.