పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి..

Panchayat election buzz in villages..– ఆశావాహుల హడావుడి
– వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ
– ఒక్కొక్క పంచాయతీ లో 04నుంచి 08 మంది ఆశావాహులు
– నియోజకవర్గం లో 184 పంచాయతీ లు
నవతెలంగాణ – పెద్దవూర
పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనతో ఆశావాహులలో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తై ఆరు నెలలు అవుతుండగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ల పదవీకాలం జూన్ 05 ఐదున ముగిసిన విషయం తెలిసిందే, పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి ఏర్పడింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావహులు ఇప్పటికే ప్రజలను, ఆయా గ్రామాలలో మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.
సాగర్ నియోజకవర్గంలో
పెద్దవూరలో 26,అనుముల 26,తిరుమల గిరి సాగర్ 34,నిడమానూరు 29,త్రిపురాం 32,గుర్రం పూడ్ 37 మొత్తం 184 పంచాయతీలు ఉన్నాయి. గతంలో ఉన్న రిజర్వేషన్ మారుతే ఎవరు? మారకపోతే ఎవరు? పోటీచేయాలని దీనిపై గ్రామాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఒక్కొక్క పార్టీ నుండి నలుగురు లేదా  ఐదుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ ఆశావహులు పోటీ చేసేందుకు ఉత్సాహపడుతున్నారు. గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలతో పాటు ఆరు గ్యారెంటీల పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ సైతం ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకుని పంచాయతీలో గెలవాలని చూస్తోంది అనే సమాచారం. పెద్దగూడెంలో 06 గురు, కొత్తలూరు 05,పెద్దవూర 07,పులిచర్ల 05, నాయినవానికుంట తండాలో 04,జయరాం తండాలో, 04,పర్వేదుల 05,పాల్తీ తండాలో 04 చింతపల్లి లో05,తుంగతుర్తి లో 06, చలకుర్తి లో 05 గురు, ఉట్లపల్లి 05,పోతునూరు లో 06,మండలం లో అతి చిన్న గ్రామ పంచాయతీ పినవూర లో 04
కోమటి కుంట తండా లో 05,పర్వేదుల 04,పాల్తీ తండాలో 05,పొట్టే వానితాందో 04, నీమానాయక్ తండాలో 05,కుంకుడు చెట్టు తండాలో 04,చింతపల్లి లో 05,కొత్తలూరులో 06,తెప్పల మడుగు,లింగంపల్లి లో 04 గురు, వెల్మ గూడెం లో 08మంది, బసిరెడ్డి పల్లి,గర్నెకుంటలో 05 గురు పోటీలో ఉంటున్నట్లు సమాచారం.
పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా
నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువత కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో నిలబడి గెలవాలని గత కొద్ధిరోజుల క్రితం అనుముల మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి చర్చించినట్లు తెలిసింది. తాజా, మాజీలు కొత్త వ్యక్తులు సర్పంచ్ కొరకు పోటీ చేసేందుకు నిమగ్నమై ఉన్నారు. స్థానిక సంస్థలు ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత భావించింది. ముఖ్యంగా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచడం కోసం బీసీ జన గణన చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం రిజర్వేషన్లు పరిశీలిస్తే పదిహేను శాతం ఎస్సీలకు,ఆరు శాతం ఎస్టీలకు,24 శాతం బీసీ రిజర్వేషన్లను ఇప్పటికే అమలై ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలి.
ఎన్నికలు నిర్వహిస్తేనే 15 వ ఆర్థిక సంఘం నిధులు
క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఆ పంచాయతీలకు కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయి.ఏడు నెలల దాటినా పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీలకు కావలసిన నిధులు ఆగిపోయాయి. దీంతో గ్రామపంచాయతీలో ప్రజలకు కల్పించాల్సిన సదుపాయాలకు కావలసిన నిధులు రాకపోవడంతో పాలన కుంటుపడింది.పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఈ నెలలో ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని, అదికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో గ్రామాలలోని పంచాయతీ ఎన్నికలు త్వరలో జరుగ నున్నట్లు తెలుసుకున్న ఆశావహులతో గ్రామాలలో ఎన్నికల సందడి నెలకొంది.
రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ
రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ లేఖకూడ రాసింది. రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తున్నందున కేంద్రం నుంచి నిధులు విడుదల కావాలంటే ఎన్నికైన స్థానిక పాలనా వ్యవస్థ ఉండడం అనివార్యం కావడంతో కేంద్రం ఈ లేఖ రాసినట్టు రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒకే సారి నిర్వ హించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ చిక్కు లున్నందున రాష్ట్ర బీసీ కమిషన్, పంచాయ తీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో ఇప్పటికే సీఎం సుదీర్ఘ రివ్యూ నిర్వహినట్లు తెలుస్తుంది.మూడు విభాగాల అధికారులకు వర్క్ డివిజన్ చేసి వీలైనంత తొందరగా ఎన్నికల నిర్వహణపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇక సీఎం విదేశీ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత దీనిపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.