నవెతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆ శాఖ ఇంజినీర్లు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం మంత్రి ఎర్రబెల్లిని వారు సన్మానించారు. పునర్వ్యవస్థీకరణ ద్వారా కొందరికి ప్రమోషన్లు రావడమే కాక, పరిపాలన సౌలభ్యం కలిగిందని వారు మంత్రికి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అధికారులు మరింత బాధ్యతతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలనీ, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మంత్రిని కలిసిన వారిలో పలువురు పీఅర్‌ఎస్‌ఇలు, ఈఈలు, డిఈఈలు, ఏఈలు ఉన్నారు