
నవతెలంగాణ – అశ్వారావుపేట : గత అయిదేళ్ళ స్థానిక పంచాయితీ పాలన గురువారంతో ముగిసింది.2019 జనవరి 25 న నాడు పంచాయితీ ఎన్నికలు నిర్వహించారు.అదే రోజు స్థానిక పాలక వర్గాలు ప్రజాపాలన లో చేరారు.గురువారం తో అయిదేళ్ళు పూర్తి కావడంతో పంచాయితీల్లో ప్రత్యేక అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఈ విషయం అయి ఎం.డి.ఒ శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయితీలకు ప్రత్యేక అధికారులు ను నియమించడానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు.పిబ్రవరి ఒకటి నుండి అధికారుల పాలన ప్రారంభం కావచ్చని తెలిపారు.