
నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎంపీఓ పై మండల పరిషత్ అధ్యక్షులు దాడి చేసి కొట్టడాన్ని నిరసిస్తూ సోమవారం హుస్నాబాద్ అక్కన్నపేట మండలాల పంచాయతీ కార్యదర్శులు హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారుల సంఘం స్టేట్ కన్వీనర్ కే సురేష్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వంలో అన్ని శాఖల అంటే అత్యధికంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నది పంచాయతీ రాజ్ శాఖ మాత్రమే అన్నారు. గ్రామాలను అభివృద్ధి దిశలో నడిపిస్తున్న ఎంపీఓపై దాడు చేయడం బాధాకరమన్నారు. ఎంపీఓపై దాడి చేసిన మండల పరిషత్ అధ్యక్షులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హుస్నాబాద్ శాఖ కార్యదర్శి జి మోహన్, హుస్నాబాద్ ఎంపీఓ లు సత్యనారాయణ , కవి కుమార్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.