పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నంనవతెలంగాణ-గణపురం
పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపెల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా పరకాల పరిధికి చెందిన వివాహిత పల్లెబోయిన శ్రావణి గణపురం మండలం కర్కపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా నాలుగేండ్లుగా విధులు నిర్వహిస్తోంది. మండలంలోని గాంధీనగర్‌లో కిరాయి ఇంట్లో తన భర్త, పాప, బాబుతో కలిసి జీవనం సాగిస్తోంది. కాగా శ్రావణి భర్త ములుగు జిల్లా పరిధిలో ఓ ప్రయివేట్‌ కంపెనీలో పని చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కిరాయికి ఉంటున్న ఇంట్లోనే శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన కుటుం బీకులు ఆమెను వరంగల్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా కర్కపల్లి గ్రామంలో శ్రావణికి మంచి పేరుంది. నిరుపేద కుటుం బానికి చెందిన శ్రావణి ఆత్మహత్యాయత్నానికి ఆర్థిక ఇబ్బందులా..? లేక పని ఒత్తిడా..? తెలియాల్సి ఉంది.