పంచాయతీ’ ప్రత్యేక పాలన’ అస్తవ్యస్తం

– నెలలు గడుస్తున్నా .. జీపీకి రానీ ప్రత్యేక అధికారులు
– కుంటుపడుతున్న పంచాయతీ అభివద్ధి
– కీలక అధికారుల వద్దకే ఫైళ్లు
– పట్టించుకోని ఉన్నతాధికారులు
నవతెలంగాణ-శంషాబాద్‌
గ్రామపంచాయతీల పాలన అస్తవ్యస్తంగా తయారైం ది. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన ఫిబ్రవరి మొదటి వా రంలో ప్రత్యేక అధికారుల పరిపాలన ప్రారంభమైంది. కొ న్ని కీలక గ్రామపంచాయతీలకు నియమించిన ప్రత్యేక అధికారులు గత ఐదు నెలలుగా గ్రామపంచాయతీ మెట్లు ఎక్కిన పాపాన పోలేదు. ఫైళ్ళని తమ దగ్గరకు తెప్పించు కుంటూ ఇష్టముంటే సంతకాలు చేయడం లేకుంటే వెనక్కి పంపడం సాధారణమైంది. ప్రత్యేక పాలన ఏర్పడినప్పటి నుంచి కొంతమంది అధికారులు గ్రామపంచాయతీ పరిపా లన విషయాలను సమీక్ష చేయడం అభివద్ధిని గురించి సమీక్ష లేదు. అసలు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధి కారులు ఉన్న విషయం కూడా చాలా మందికి తెలియని పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనగణన చేపట్టిన అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించవ లసిన పరిస్థితుల నేపథ్యంలో ఆరు నెలల కోసం రాష్ట్రవ్యా ప్తంగా ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చింది. ప్రత్యేక అధికారులకు గ్రామపంచాయతీ కార్యదర్శి జాయింట్‌ చెక్‌ పవర్‌ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే ప్రత్యేక అధికారుల పాలన గ్రామ పంచాయతీలలో కొనసాగుతున్నది. సర్పంచికి ఏ రకమైన అధికారులు ఉంటాయో ప్రత్యేక అధికారులకు వాటిని బదిలీ చేశారు.
గ్రామ పాలనలో అభివద్ధిలో వీరిదే కీలకపాత్ర
పారిశుద్ధ్యం, జీతభత్యాలు, నీటి సరఫరా, పన్నుల వసూళ్లు, అనుమతులు, విద్యుత్‌ నిర్వహణ, వివిధ రకాల ఆదాయ వ్యయాలు, ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత ప్రత్యేక అధికారులకు ఉంటుంది. చెక్‌ పవర్‌ తో పాటు చట్ట విరుద్ధమైన ఏ అంశంపైన అయినా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ పరిధిలో జరిగే అభివద్ధి కార్యక్రమాలు సమీక్ష చేపట్టాల్సిన కర్తవ్యాల గురించి స్థానిక సిబ్బంది అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు వాళ్లకు కావాల్సిన ధ్రువపత్రాలు తదితరు అంశాలను పరిష్కరిం చాలి.కీలకమైన బాధ్యతలో ఉన్న ప్రత్యేక అధికారులు గ్రా మ పంచాయతీల వైపు కన్నెత్తి చూడడం లేదంటే ఆశ్చర్యం కలగక మానదు.
శంషాబాద్‌ మండలంలో 27 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. పెద్ద గ్రామపంచా యతీలు అయిన పాలమాకుల-తహసీల్దార్‌ కొప్పెర నాగ మణి, పెద్దషాపూర్‌-ఎంపీడీవో జీ. మున్ని, నర్కూడ- ఎంపీఓ ఉషా కిరణ్‌తో పాటు చౌదరిగుడ, సుల్తాన్‌ పల్లి, కవ్వగూడ గ్రామాలకు మండల విద్యాధికారి డి రామిరెడ్డి ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. పాలమాకుల స్పెష ల్‌ ఆఫీసర్‌ గత ఐదు నెలల కాలంలో ఒక్కసారి కూడా గ్రా మపంచాయతీకి రాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండుసార్లు ప్రభుత్వ సమావేశాలు గ్రామపంచాయతీ వద్ద జరిగినప్పటికీ కార్యాలయానికి వెళ్లలేదని తెలుస్తుంది. కీల కమైన అధికారులు గ్రామ పంచాయతీలకు వెళ్లకుండా సమీక్షలు జరపకుండా అక్కడ జరిగే అభివద్ధి కార్యక్రమా లపై తమ వద్దకే ఫైల్‌ తెప్పించుకొని సంతకాలు పెడుతు న్నారు. మండల పరిధిలోని చౌదరిగూడ గ్రామ రెవెన్యూ లో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. ఈ విషయం లో పంచాయతీ కార్యదర్శిపై అనేక ఆరోపణలు వస్తున్నా యి. పంచాయతీ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్న డి. రామిరెడ్డికి అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలు వ స్తున్న ఫిర్యాదులు గురించి పట్టించుకోవడం లేదు. మం డల పరిధిలోని రాయన్నగూడలో గ్రామకంఠం భూమిలో మహేష్‌ కుమార్‌ బాబు అనే వ్యక్తి ఇంటి అనుమతి కోసం పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు చేసుకొని చెప్పులు అరిగే లా తిరుగుతున్న అనుమతులు ఇవ్వడం లేదు. ఈ విష యంపై ప్రత్యేక అధికారికి ఫిర్యాదు చేస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. దర్జాగా తమ కార్యాలయంలోనే ప్రత్యేక అధికారులు తమ పనులు చక్కబెట్టుకుంటూ రికార్డులను తమ వద్దకు తెప్పించుకుం టూ గ్రామపంచాయతీ పాలనను గాలికి వదిలేస్తున్నారు. ప్రతిరోజు లేదా వారంలో రెండు మూడుసార్లు వచ్చి పర్యవే క్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహ రిస్తున్నారు. ఇదే అదునుగా శంషాబాద్‌ మండలంలో అక్ర మ నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు. చెరువులు, కుంట లు, వాగులు ప్రభుత్వ భూములు అక్రమిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నా రు. పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ కా ర్యదర్శులు సమస్యను ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్ల కుండా అవినీతికి పాల్పడుతున్నారు. వినిపిస్తున్నాయి. స మస్యలపై ఫిర్యాదు చేస్తే పంచాయతీ కార్యదర్శి ఎంపీఓ చర్యలు తీసుకోవాల్సింది పోయి ఉన్నతాధికారులకు తప్పు డు రిపోర్ట్‌ ఇస్తు క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణదారులకు వత్తాసు పలుకుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమై నా ప్రత్యేక అధికారుల పాలన గ్రామ పంచాయతీల అభివ ద్ధికి ఆటంకంగా మారింది. ప్రత్యేక అధికారులుగా అధికా రులు బాధ్యతలు తీసుకున్న తమకు ఎందుకులే అనే భావ నతో పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని గ్రామ పాల న అభివద్ధి పనితీరుపై సమీక్ష చేసి అలసత్వం వ హించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పరి పాలన గాడిలో పెట్టాలని కోరుతున్నారు.