పంచాయతీ సిబ్బంది కి సన్మానాలు, ప్రశంస పాత్రల అందజేత..

నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 15-న పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా డిచ్ పల్లి,ఇందల్ వాయి మండల కేంద్ర లతో పాటు అన్ని గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి, గంగారాం తండా గ్రామ పంచాయతీ లలో ప్రత్యేక అధికారులు డిప్ చంద్,రాజ్ కాంత్ రావు లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.అన్ని గ్రామ పంచాయతీ లలో పంచాయతీ సిబ్బంది కి ఘనంగా సన్మానించి,వారు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రశంస పాత్రలను అందజేశారు.గ్రామ పంచాయతీ లలో జామ ఖర్చులను ప్రజలకు వివరించి, గ్రామంలో ర్యాలీ లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు లోలం సత్యనారాయణ, సుమిత్ర చందర్,తెలు విజయ్ కుమార్, పాపాయి తిరుపతి, మమతా శేఖర్,
పానుగంటి రూపా సతిష్ రెడ్డి, లలితా దాస్, పత్తి మమతా ఆనంద్, ఖాతిజా యూసఫ్, నడ్పన్న, పాశం సత్తేవ్వ నర్సింలు, ఉప సర్పంచులు రఘునథన్ రాము,యెంకనోల్ల రమేష్, ఎంపిటిసి చింతల దాస్, కరోబర్లు షేక్ అసిఫోద్దిన్,పిల్లి నరెందర్, కార్యదర్శులు శ్రీధర్, నిట్టు కిషన్ రావు,కవిత, డి సంగోటం, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు,బిఅర్ ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.